KNR: కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికిగానూ పీజీ కోర్సుల్లో ఖాళీల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రో.డి. వరలక్ష్మి తెలిపారు. ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, ఎంకాం, ఎమ్మెస్సీ బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తులను కళాశాలలో ఈ నెల 17వ తేదీ సా. 5గం.లలోపు అందజేయాలన్నారు.