CTR: సదుం మండలం ఎర్రాతివారిపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం నుంచి అన్నదానం ప్రారంభిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఏటా నవంబర్ మూడో వారం నుంచి జనవరిలో సంక్రాంతి వరకు ఆలయానికి వచ్చే స్వాములు, భక్తుల కోసం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తారు. మూడు పూటలా భక్తులకు అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.