బీహార్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖ యూట్యూబర్ మనీశ్ కశ్యప్ ఘోర పరాజయం పాలయ్యారు. చన్పటియా నియోజకవర్గంలో జన్ సురాజ్ అభ్యర్థిగా పోటీ చేసిన మనీష్.. 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. సోషల్ మీడియాలో పాపులారిటీ, 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు.