అన్నమయ్య: కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సు పక్కకు ఒరిగిన ఘటన నిన్న సుండుపల్లె మండల పరిధిలో చోటుచేసుకుంది. రాయచోటి డిపో నుంచి పింఛకు బయలుదేరిన బస్సు అనుంపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి పక్కనే ఉన్న కాలువలోకి వెళ్లినట్లు స్థానికలు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.