KDP: నగర శివారులోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈనెల 17వ తేదీ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్ 31 రోజులు బ్యూటీ పార్లర్ 35 రోజులు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆరిఫ్ తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు అర్హులన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.