కృష్ణా: మొవ్వ మండలంలో వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలను సబ్సిడీ ధరలపై వెంటనే అందుబాటులో ఉంచాలని రైతు సంఘం కృష్ణాజిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ శాఖ ద్వారా అన్ని గ్రామాల్లోని రైతులకు రైతు సేవ కేంద్రాల ద్వారా సబ్సిడీ విత్తనాలు అందజేయాలని ఆయన నిన్న డిమాండ్ చేశారు.