TG: CM రేవంత్ అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండటంతో.. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలని చర్చించనున్నారు. కాగా, పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. కానీ పార్టీ పరంగా BCలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తారట.