KMM: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 49వ డివిజన్, మామిళ్ళగూడెంలో రూ.2.47 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగరాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.