ELR: జిల్లా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల్లో ఈ నెల 22 నుంచి నిపుణులైన వైద్యులతో దివ్యాంగుల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు APC పంకజ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పోలవరం 22, చింతలపూడి 23, కైకలూరు 24, ఉంగుటూరు 25, నూజివీడు 26, దెందులూరు 27, ఏలూరు 28వ తేదీల్లో వైద్య సేవ నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షలు అనంతరం ఉచితంగా ఉపకరణాలను అందజేస్తామని పేర్కొన్నారు.