PDPL: ఓదెల మండల కేంద్రంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణలో చిందుకళాకారులు సుగుణావతి కథ యక్షగానం ప్రదర్శించారు. ఆధునిక ఫేస్బుక్ యూట్యూబ్ కాలంలో సంప్రదాయ యక్షగానాన్ని చూసి భక్తులు ఫోటోలు తీశారు. స్థానిక ఎస్సై దికొండ రమేష్ కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు గడ్డం కనుకయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.