అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని ఉస్మాన్ నగర్లో శనివారం సాయంత్రం షేక్ షావల్లి (28)అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకున్నట్లు తెలియాజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.