ADB: బజార్హత్నూర్ మండల కేంద్రంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేష్ శనివారం రాత్రి పర్యటించారు. గ్రామానికి చెందిన చెవుల రత్నాభాయ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న MP నగేశ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు. ఎంపీ వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.