ADB: పోలీసులు ప్రజల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరిస్తే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం బోథ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించి పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.