NZB: నవీపేట్(M) నాలేశ్వర్లో గోదావరిలో మునిగి వ్యక్తి మృతి చెందినట్లు నవీపేట్ ఎస్సై తిరుపతి ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. ముత్యంపల్లి గ్రామానికి చెందిన చిన్న సాయిలు తల్వేదలో శుక్రవారం పెళ్లికి వెళ్లాడు. శనివారం ఉదయం లేచి కాలకృత్యాలకు గోదావరి వైపు వెళ్లి కాలుజారి పడి నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు.