SRPT: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం కలిగిన, ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారి (ఏఈ) మల్లారెడ్డి నిర్వాహకులను ఆదేశించారు. నిన్న సాయంత్రం నూతనకల్ మండలంలోని ఎర్రపహాడ్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆయన తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులు 17 శాతం లోపు తేమ ఉండేలా ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు.