ATP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23న రాప్తాడు నియోజకవర్గానికి రానున్నారు. స్థానిక వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి వారి కుటుంబంలో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆయన రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు హెలిప్యాడ్ ను సిద్ధం చేస్తున్నారు. బెంగళూరు నుంచి రాప్తాడుకు రానున్నారు.