అన్నమయ్య: మదనపల్లె కేంద్రంగా సాగుతున్న కిడ్నీ రాకెట్ కేసులో మరో 8 మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ మహేంద్ర తెలిపారు. ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ రాకెట్లో కీలక పాత్ర పోషించిన మిగతా వారిని పట్టుకోవడానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించామన్నారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు.