ప్రకాశం: కంభం పట్టణంలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ నరసయ్య తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్మార్ట్ బజార్, స్టేట్ బ్యాంక్, రిజిస్టర్ ఆఫీస్, టౌన్ బ్యాంక్, సాయిబాబా గుడి, పార్క్ వీధి, చిన్న కృష్ణమ్మ వీధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.