AP: ఈ నెల 18న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం జరగనుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన స్థానిక అన్నమయ్య భవనంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాల్లో సీఎం చంద్రబాబు సూచనల మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.