GNTR: పెదకాకాని పోలీసు స్టేషన్ పరిధిలోని నంబూరు విజయభాస్కర్ నగర్లో శనివారం రాత్రి జరిగిన దాడుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న సంపతమ్మను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 2,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని సీఐ నారాయణ స్వామి హెచ్చరించారు.