TG: మజ్లిస్‌ను ఫలానా పార్టీకి బీ-టీం అంటూ విమర్శించిన వారికి బీహార్ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం చెంపపెట్టు లాంటిందని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కొలువుదీరినా MIMతో దోస్తీ కోరుకుంటుందని.. మజ్లిస్ సత్తాయే దీనికి కారణమన్నారు. తన స్థానంలో పార్టీకి బలమైన నాయకుడు వస్తే.. పదవిని వదిలి ప్రశాంతంగా జీవిస్తానన్నారు.