MDK: తూప్రాన్ మండలానికి చెందిన ఓ వ్యక్తి వాట్సప్ కు వచ్చిన లింకు ఓపెన్ చేస్తే రూ. 27,100 మాయమైనట్లు ఎస్సై శివానందం తెలిపారు. వాట్సప్ గ్రూపులో వచ్చిన యోనో యాప్ ఇన్స్టాల్ చేసేందుకు ఓపెన్ చేయడంతో సక్సెస్ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. కొంతసేపటికి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 27,108 నుంచి రూ. 27,100 డెబిట్ అయినట్లుగా మెసేజ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.