ASF: సిర్పూర్ (T)మండల కేంద్రం నుంచి చిలపిల్లి వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి ఆదివారం తెల్లవారుజామున బోల్తా పడింది. ప్రమాదంలో లింబుగూడకి చెందిన సిడాం భీంరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా ప్రయాణికులు, ఆటో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. SI సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం ఆసుపత్రికి తరలించారు