W.G: వాణిజ్య అవసరాలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో శనివారం తాడేపల్లిగూడెంలో విజెలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొబ్బరితోట ప్రాంతంలోని సోమిశెట్టి వెంకటేశ్వరరావు క్యాటరింగ్ షాపలో అక్రమంగా నిల్వ ఉంచిన 10 గ్యాస్ సిలిండర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ ఎస్సై K. సీతారాం తెలిపారు.