ASF: SC జాతీయ కమిషన్, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సభ్యుడు లవకుష్ కుమార్ ఆదివారం కాగజ్నగర్ రానున్నారని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు సందర్శిస్తారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల సంక్షేమం, వసతి గృహాల్లో సదుపాయాలు, విద్యా ప్రమాణాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారన్నారు.