KDP: కమలాపురం, వీరాపునాయినపల్లి శాఖా గ్రంథాలయంలో శనివారం గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో స్థానిక పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రంథాలయాధికారి విద్యార్థులకు పుస్తకాలు అందించి జ్ఞానం, వినోదం గురించి వివరిస్తూ, నిత్యం పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.