హర్యానాలోని 4 జిల్లాల్లో ఫేక్ బ్యాంకు శాఖలు సృష్టించి ప్రజలను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కుంభకోణం బయటపడింది. ‘PNL’ పేరుతో బోగస్ బ్యాంకు పెట్టిన నిందితులు ప్రజల డిపాజిట్లకు 26 నెలల్లో రెట్టింపు మొత్తం ఇస్తామంటూ పలువురిని మోసగించారు. ఈ కేసులో కర్నాల్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.