TG: జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ రాజధాని బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుతాసుపత్రికి తరలించారు. హన్మకొండ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.