NGKL: కవ్వాల్, అమ్రాబాద్, వికారాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అటవీశాఖ చేపట్టిన పులుల లెక్కింపునకు వాలంటీర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మంది స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధిక మంది వాలంటీర్లు ముఖ్యంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు.