SRPT: మోతె మండలంలోని నర్సింహపురం గ్రామంలో శనివారం కార్తీక మాసం సందర్భంగా పాలేరు వాగు బ్రిడ్జి వద్ద లక్ష దీపోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ కొండ లక్షయ్య ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం గ్రామ దేవతలకు అభిషేకాలు చేసి సాయంత్రం మహిళలు దీపాలు వెలుగించారు. దీంతో వాగు తీరం అంతా వెలుగుల హారంగా మారి కార్తీక శోభను సంతరించుకుంది.