NZN: బోధన్ న్యాయస్థానంలో శనివారం జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్లో వివిధ కోర్టులలోని 708 కేసులు పరిష్కారం అయ్యాయని ఐదో అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవ కమిటీ అధ్యక్షురాలు వరూధిని తెలిపారు. ఈ పరిష్కారాల ద్వారా జరిమానా రూపంలో రూ. 13,06,999 లు ప్రభుత్వ ఖజానాకు సమకూరిందని ఆమె వెల్లడించింది.