SRPT: అనంతగిరి మండలం శాంతినగర్ సబ్‌స్టేషన్‌ల్లో అత్యవసర మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సీతారాం తెలిపారు. శాంతినగర్, లకారం, బొజ్జగూడెం తండా గ్రామాలతో పాటు శాంతినగర్, బొజ్జగూడెం ఇండస్ట్రీస్‌కు సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు సహకరించాలని ఏఈ కోరారు.