AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. రేపు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రకాశం, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి.