PDPL: గోదావరిఖనిలోని ఆర్సీవోఎ క్లబ్లో రేపు యోగా గురువు షణ్ముక శివ చంద్రచే అవగాహన కార్య క్రమం నిర్వహించనున్నట్లు ఆర్జీ 1 జీఎం డీ. లలిత్ కుమార్ తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా వల్ల కలిగే ఫలితాలపై ఈ అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆర్జీ 1 ఏరియాలోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హాజరుకావాలని జీఎం కోరారు.