యూపీ గోరఖ్పుర్కు చెందిన హృతిక్ పంజాబ్ యూనివర్సిటీలో మనిషి వెంట్రుకలతో ఎరువు తయారు చేశారు. హెయిర్ సెలూన్ల నుంచి వెంట్రుకలను పోగుచేసి వాటిని ఎంజైమ్లను జోడించి ఎరువును తయారు చేసినట్లు చెప్పారు. వెంట్రుకల్లో నత్రజని, ప్రొటీన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని, ఈ ఎరువు మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుందని తెలిపారు. యూరియాకు ప్రత్యామ్నయంగా తోడ్పడుతుందని పేర్కొన్నారు.