ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియా దేశాల్లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం శంషాబాద్ ఎయిర్పోర్టుపై పడింది. పశ్చిమాసియా దేశాలకు వెళ్లాల్సిన 22 విమానాలు, అక్కడి నుంచి రావాల్సిన మరో 22 విమానాలు రద్దయ్యాయి. దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమానం ఇంధనం ఫిల్ చేసుకొని తిరిగి వెళ్లిపోయింది.