ELR: నూజివీడు(మం) ముక్కొల్లుపాడులో మారుమూడి రాజుకు చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్తో మంగళవారం దగ్ధమయింది. ఉపసర్పంచ్ కలగర శివ సాయి మాట్లాడుతూ.. ప్రమాద సమాచారం తెలుసుకున్న మంత్రి పార్థసారథి బాధిత కుటుంబానికి రూ. 5వేలు, బియ్యం, నిత్యవసర సరుకులు తక్షణసాయంగా అందించినట్లు చెప్పారు. మంత్రి కొత్త ఇంటిని మంజూరు చేసేందుకు హామీ ఇచ్చినట్లు వివరించారు.