సత్యసాయి: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో కురబలకు రక్షణ లేదని, పాపిరెడ్డిపల్లిలో సింగమయ్య, ఆలూరులో బండారు వీరన్న, కనగానపల్లికి చెందిన మురళీ హత్యలకు టీడీపీ నాయకులే కారణమని ఆరోపించారు. వైఎస్ జగన్ కురబ కుటుంబాలను పరామర్శించగా కేసులు పెట్టడం అన్యాయమని, కురబలపై ఉన్న అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.