KNR: వీణవంక మండలంలోని చల్లూరు మానేరు వాగు నుంచి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. రెండు ట్రాక్టర్లను స్టేషన్కు తరలించి, వాటి యజమానులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.