KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని YVS మున్సిపల్ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ యల్లాల ఆసిఫా, భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగే మాక్ అసెంబ్లీకి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా హాజరు కానుంది. ఇందులో భాగంగా మండల విద్యాశాఖాధికారి సావిత్రమ్మ తెలిపిన వివరాల ప్రకారం, నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆసిఫాను ఎంపిక చేశారు.