BDK: ఈ నెల16వ తేదీన కొత్తగూడెం క్లబ్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సీపీఐ నాయకులు సోమవారం తెలిపారు. సింగరేణి వారి సహకారంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ మేళాను జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు సంపాదించు కోవాలని CPI కార్యదర్శి కంచర్ల జమలయ్య పిలుపునిచ్చారు.