ADB: జిల్లాలో వరుస పులి దాడులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల గాదిగూడలో కనిపించిన పెద్దపులి 2 రోజుల క్రితం నిర్మల్ జిల్లా పెంబిలో ఓ ఆవుపై దాడి చేసి హతమార్చింది. శుక్రవారం మంచిర్యాల జిల్లా కాసిపేటలో మరో ఆవుపై పులి దాడి జరిగింది. ఇదిలా ఉంటే సారంగాపూర్లో మరో చిరుత సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.