నిర్మల్: బీఆర్ఎస్ పార్టీ కడెం మండల మాజీ వైస్ ఎంపీపీ కట్ల శ్యాంసుందర్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేశామని ఆ పార్టీ మండల అధ్యక్షులు జీవన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. శ్యాంసుందర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశామని, ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు.