NZB: బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచాలని ఆర్టీసీ కార్పొరేట్ చీఫ్ ఇంజనీర్ కవిత ఆదేశించారు. నిజామాబాద్ బస్టాండ్‌ను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రత పరిశుభ్రతలో ఎటువంటి లోపాలు లేకుండా నిత్య పర్యవేక్షణ జరపాలన్నారు. అవసరమున్న చోట భవనానికి మరమ్మతులు చేపట్టాలని సూచించారు.