TG: ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహకుడు రవి ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్‌ను ప్రమోట్ చేసినట్లు తేలింది. సైట్లో 1XBet వంటి యాప్‌ల ప్రకటనలు పెట్టి.. సినిమా చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించేందుకు ప్లాన్ చేశాడు. ఆ కంపెనీల నుంచి ఆన్లైన్ లింక్‌ల ద్వారా భారీగా నిధులు అందుకున్నాడు. ఈ లింక్‌ల ఆధారంగానే పోలీసులు రవిని ట్రేస్ చేసి పట్టుకున్నారు.