CTR: కానిపాకంలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ మేరకు దేవస్థానం అతిథి గృహంలో సిబ్బందితో ఈవో పెంచల కిషోర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆలయ మాడవీధులలో ర్యాలీ చేశారు. పారిశుద్ధ్యనికి అందరూ ప్రాధాన్యం ఇవ్వాలని ఈవో కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ధనుంజయ, ఎస్వీ కృష్ణారెడ్డి, శానిటరీ, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.