మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోన్న ప్రియాంక చోప్రా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా అభిమానులు గర్వపడేలా ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు తాను తెలుగు సరిగా మాట్లాడలేక పోతున్నానని, ప్రీ రిలీజ్ ఈవెంట్ నాటికి స్పష్టమైన తెలుగులో మాట్లాడతానని పేర్కొంది.