వారణాసి మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గ్రోబ్ ట్రాటర్ ఈవెంట్లో మహేష్ బాబు తెలిపారు. ‘ఈ మూవీ చూసి ప్రతి ఒక్కరూ గర్వపడేలా కష్టపడతా. రాజమౌళి మరింత గర్వపడేలా నటిస్తా. ఇది జస్ట్ టైటిల్ రివీల్ ఈవెంట్ మాత్రమే. మున్ముందే ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ సినిమాను చూసి మొత్తం భారతదేశం గర్వపడుతుంది’ అని అన్నారు.