MNCL: జన్నారం మండలంలో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. ఇసుక ప్లానెట్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు తిరుగుతున్నప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం, పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.