వారణాసి సినిమాలో రామాయణానికి సంబంధించిన ఒక ఘట్టాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు రాజమౌళి చెప్పారు. ఇందులో మహేష్ బాబును తొలిసారిగా రాముడి వేషంలో చూసినప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని తెలిపారు. మహేష్ రాముడిగా ఉన్న ఫొటోను తన వాల్ పేపర్‌గా పెట్టుకున్నానని చెప్పారు. కాకపోతే మళ్లీ ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో తీసేసినట్లు పేర్కొన్నారు.